23, జనవరి 2012, సోమవారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - 1


మోహనవంశీ భావ భూమికనై
నీలిరాగమున మనసు ముమ్మడుగులై
విశ్వనాధ కృష్ణ భావనల ఊపిరులూది
‘సుప్రసన్న’ కృష్ణ బీజాక్షరిలో ‘సంపత్తు’ నైతి.

1
నీలమోహనా నిను చేరుటకై యాతన మనశ్శరీరముల
నీ రూపం కోసం నా కన్నులు వాకిళ్ళయినయి
తపిస్తున్నది శ్రవణేంద్రియం నీ వేణుగానం కోసం
నీ నామస్మరణ కోసం అనునిత్యం ఆత్మకు తపన.
కనులకు కనపడదేమీ నీ మనోజ్ఞ రూపం
వినపడవేమీ నీ పద ధ్వనులు నా అంతరంగాన
ఆలోచనాలోచనాలు అనేకమయి, నీలవర్ణుని
అర్థ మెరుగడు ఈ ‘రంగ’డు తదన్యుడయి.

2 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

‘శ్రీలేఖ సాహితి’ బ్లాగును ప్రారంభించిన సందర్భంగా శుభాకాంక్షలు.
ఇంతకాలంగా మీరు చేస్తున్న సాహితీసేవ ఈ బ్లాగుముఖంగా విస్తృతం కావాలని కోరుకుంటున్నాను.

మరువం ఉష చెప్పారు...

నమస్కారం. బ్లాగు కారణంగా మీ వంటి భాషావేత్తలు, భాషా పరమైన సేవలందిస్తున్నవారు తెలియటం బావుంది. మీ వ్యాసాలు, పరిశోధనాంశాల వివరాలు తెలుపుతారని ఆశిస్తూ.
-ఉష