30, జనవరి 2012, సోమవారం

నీలమోహనాష్టకం (వచనపద్యాలు) - 7

 7

నా కన్నులు నిరతము ఎండిన చీకటి నేలలై
నీ కన్నులు నిరతము దయావార్షుకాభ్రములై

నా హృదయమ్మున అనవసర ప్రయాసలై నిత్యము
నీ హృదయమ్మున మము బ్రోచే ఊహలే నిత్యము

నా బుద్ధిలోన నిరతము వెలితి వెలితి వెలితి
నీ బుద్ధిలోన నిరతము నిండారిన ధర్మాధృతి

నీ సన్నిధిలోన నిత్యము నేనిక నిలువగలుగు టెప్పుడో
నా అనుభవ కాసారాంత‘రంగ’మున నీ మునుగుట ఎన్నడో.

2 వ్యాఖ్యలు:

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

శ్రీరంగస్వామి గారు!
అంతర్జాల సాహిత్యరంగంలోకి అడుగిడిన సందర్భంగా మీకు నా హృదయ పూర్వకాభినందనలు!

టి. శ్రీరంగస్వామి చెప్పారు...

డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
ధన్యవాదాలు.